MLC Parvartha Reddy Car Accident: ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి కారుకు ప్రమాదం.. ఎమ్మెల్సీ తలకు గాయాలు.. అక్కడికక్కడే మృతిచెందిన పీఏ.. విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తుండగా ప్రమాదం (వీడియో)

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. గురువారం అర్ధరాత్రి నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక సమీపంలో జరిగిన ఈ యాక్సిడెంట్‌ లో ఆయనకు గాయాలయ్యాయి.

MLC Parvartha Reddy Car Accident: ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి కారుకు ప్రమాదం.. ఎమ్మెల్సీ తలకు గాయాలు.. అక్కడికక్కడే మృతిచెందిన పీఏ.. విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తుండగా ప్రమాదం (వీడియో)
MLC Parvartha Reddy (Credits: X)

Vijayawada, Jan 5: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (MLC) పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి (Parvartha Reddy Chandrashekhar Reddy) ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి (Road Accident) గురయ్యింది. గురువారం అర్ధరాత్రి  నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక సమీపంలో జరిగిన ఈ యాక్సిడెంట్‌ లో ఆయనకు గాయాలయ్యాయి. ఎమ్మెల్సీ పీఏ ఘటనాస్థలంలోనే మృతిచెందారు.

ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉండగా గాయపడినవారిని నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి హుటాహుటిన తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కారు ముందు వెళుతున్న లారీ టైరు పంక్చరు కావడంతో ఒక్కసారిగా నెమ్మదించిందని, దీంతో లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. లారీని ఢీకొని డివైడర్‌పై పడిపోయిందని వివరించారు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.

MLC Bye-Election in Telangana: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 29న పోలింగ్, అదే రోజు ఫలితాలు, షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 05, 2024 08:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).