బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పబ్లిక్ గా మందేసి చిందేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత బీజేపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 10న పాండురంగాపురం యాగంటి రిసార్ట్‌లో మందు పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సతీష్ అనుచరులు హాజరయ్యారు. అందరూ మద్యం తాగి తందనాలాడారు.
బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ సైతం ఆ పార్టీకి హాజరయ్యారు. మద్యం మత్తులో అన్నం సతీష్ ప్రభాకర్ భీమ్లానాయక్ పాట పెట్టించుకుని డాన్స్ చేశారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ సైతం సతీష్‌తో కలిసి బెల్లీడాన్స్, తీన్మార్ స్టెప్పులు వేశారు. అంతటితో ఆగకుండా సతీష్ చేతిలోని మద్యం గ్లాసు అందుకుని గటగటా తాగేశారు. ఆ తరువాత సతీష్ బుగ్గలు నిమురుతూ ముద్దులతో ముంచెత్తారు.ఎమ్మెల్యే విన్యాసాలను చూసిన అక్కడి వారు నోరెళ్లబెట్టి చూస్తుండిపోయారు.
Bapatla TDP MLA Narendra Varma Raju Vegesana Viral Video
బీజేపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ పుట్టినరోజు వేడుకల్లో పీకలదాకా మద్యం తాగి.. చిందేసిన బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నరేంద్రవర్మ
టీడీపీ ఎమ్మెల్యేలకి నువ్వు నేర్పించిన క్రమశిక్షణ ఇదేనా @ncbn ?#NaraLiquorBabu#IdhiMunchePrabhutvam#SadistChandraBabu#MosagaduBabu pic.twitter.com/v0f3FT3sWo
— YSR Congress Party (@YSRCParty) December 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)