Cyclone Michaung: వీడియో ఇదిగో, వరద నీటితో పరవళ్లు తొక్కుతున్న తిరుమల కపిలతీర్థం జలపాతం, చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు
తిరుమల కొండల మధ్య ఉన్న కపిలతీర్థం జలపాతం వరద నీటితో ఉప్పొంగుతోంది. మిచాంగ్ తుపాను కారణంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో శేషాచల అటవీప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో కపిలతీర్థం జలపాతం పరవళ్లు తొక్కుతూ కిందికి దూకుతోంది
తిరుమల కొండల మధ్య ఉన్న కపిలతీర్థం జలపాతం వరద నీటితో ఉప్పొంగుతోంది. మిచాంగ్ తుపాను కారణంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో శేషాచల అటవీప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో కపిలతీర్థం జలపాతం పరవళ్లు తొక్కుతూ కిందికి దూకుతోంది. ఇక్కడి మాల్వాడి గుండం జలకళ సంతరించుకుంది. కపిలతీర్థం జలపాతం పోటెత్తుతుండడంతో చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలిస్తున్నారు. జలపాతానికి సంబంధించిన వీడియోను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు. భారీ వర్షాలకు పూర్తిగా నిండిపోయిన తిరుపతిలోని ఐదు ప్రధాన డ్యామ్‌లు, ప్రస్తుతం బాపట్లలో తీరం దాటుతున్న తుఫాన్
Here's Video
కలియగదైవం శ్రీ వెంకటేశ్వరుస్వామి పాదాల చెంత కపిల తీర్థం వద్ద జల ఉధృతి ! గోవిందా ! pic.twitter.com/2T6SDohrgs
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) December 5, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 05, 2023 03:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

