Andhra Pradesh: వీడియో ఇదిగో, మహిళ కడుపులో నుంచి 570 రాళ్లను సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు, ఆమె బ్లాడర్ స్టోన్స్ సమస్యతో బాధపడుతుందని వెల్లడి
మహిళ కడుపులో 570 రాళ్లను సర్జరీ చేసి డాక్టర్లు తొలగించారు. ఈ ఘటన ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చోటు చేసుకుంది.
Doctors Removed 570 stones in woman's stomach: మహిళ కడుపులో 570 రాళ్లను సర్జరీ చేసి డాక్టర్లు తొలగించారు. ఈ ఘటన ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చోటు చేసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తంకు చెందిన నరసవేణి అనే మహిళ కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. టాబ్లెట్లు వాడుతూ తాత్కాలిక ఉపశమనం పొందేది. 60 ఏళ్ల వృద్ధుడి కిడ్నీ నుంచి 418 రాళ్లను తొలగించిన వైద్యులు, శరీరంపై కోత పెట్టకుండా కొద్దిపాటి శస్త్రచికిత్సతో రాళ్లను తొలగించిన ఏఐఎన్‌యూ వైద్యులు
అయితే ఓ రోజు భరించలేనంతగా నొప్పి రావంతో వెంటనే అమలాపుంరలోని ASA ఆస్పత్రికి వెళ్లారు.అక్కడ డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించారు.. ఆమె బ్లాడర్ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. ఆమెకు అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చింది.. ఆమె కడుపులో నుంచి ఏకంగా 570 రాళ్లను బయటకు తీసిన డాక్టర్లు అవాక్కయ్యారు. కడుపులో ఇన్ని రాళ్లు ఉండటంతో చాలా అరుదుగా జరుగుతుందని డాక్టర్లు అంటున్నారు. మహిళకు సమయానికి సర్జరీ చేశామని.. ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
Here's Video
మహిళ కడుపులో 570 రాళ్లు.. సర్జరీ చేసి తొలగించిన డాక్టర్లు
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ మహిళ గాల్‌స్టోన్స్ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రిలో జాయిన్ కాగా.. వైద్యులు సజ్జరి చేసి కడుపులో నుండి 570 రాళ్లు తొలగించారు. pic.twitter.com/AyE2smQahE
— Telugu Scribe (@TeluguScribe) May 21, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 21, 2024 10:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

