Dwaraka Tirumala Rao: ఏపీ పోలీస్ బాస్‌గా ద్వారకా తిరుమలరావు, పోలీసు దళాల అధిపతిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ఏపీ రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కో ఆర్డినేషన్‌ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా (హెచ్‌ఓపీఎఫ్‌)గా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది

Dwaraka Tirumala Rao: ఏపీ పోలీస్ బాస్‌గా ద్వారకా తిరుమలరావు, పోలీసు దళాల అధిపతిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
Dwaraka Tirumala Rao

ఏపీ రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కో ఆర్డినేషన్‌ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా (హెచ్‌ఓపీఎఫ్‌)గా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.  వీడియో ఇదిగో, అమరావతి శంకుస్థాపన ఏరియాలో నేలపై మోకరిల్లి నమస్కరించిన సీఎం చంద్రబాబు

సార్వత్రిక ఎన్నికల సమయంలో కేవీ రాజేంద్రనాథరెడ్డిపై బదిలీ వేటు వేసిన ఎన్నికల సంఘం... హరీష్‌కుమార్‌ గుప్తాను డీజీపీగా నియమించింది. మే 6న డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్‌కుమార్‌ గుప్తా దాదాపు నెలన్నర పాటు ఆ పోస్టులో కొనసాగారు.తాజాగా ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 20, 2024 01:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).