వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అడ్వకేట్ గా మారిపోయారు. ఏపీ హైకోర్టులో తన పిటిషన్ పై తానే వాదనలు వినిపించారు. ఇక ఎ‍ల్లోమీడియాకు మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు వార్నింగ్‌ ఇచ్చారు. గుంటూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం(జనవరి6) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పిచ్చి కథనాలు రాస్తే చూస్తూ ఊరుకోం.మళ్లీ మా చేతిలోకి పగ్గాలు వస్తాయి. అయినా మేం మీలా కక్ష సాధింపులకు పాల్పడం.

గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా ఇద్దరు మృతి, మృతుల కుటుంబాలకు జ‌న‌సేన త‌ర‌ఫున రూ.5 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్

గేమ్‌ చేంజర్‌ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా చనిపోయిన వారి కుటుంబాలను పవన్‌ ఎందుకు పరామర్శించలేదు. చనిపోయిన వారికి రూ.2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలి.పుష్ప 2 ఘటనపై స్పందించిన పవన్‌ గేమ్‌చేంజర్‌ మృతుల కుటుంబ సభ్యుల దగ్గరికి ఎందుకు వెళ్లలేదు. సంఘటన ఎక్కడ జరిగిందనేది కాదు ఎవరివల్ల జరిగిందనేది ముఖ్యం. అభిమానుల ప్రాణాలకు విలువ లేనట్లుగా మాట్లాడుతున్నారు.రోడ్డుబాగాలేదని పవన్‌ చెప్పడం విడ్డూరంగా ఉంది’అని అంబటి రాంబాబు అన్నారు.

 Ambati Rambabu became an advocate

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)