Visakh Refinery Expansion: ఏపీకి గుడ్ న్యూస్..విశాఖ రిఫైనరీ ఆధునికీకరణ వ్యయం రూ.26,264 కోట్లకు పెంచుతూ కేంద్రం కీలక ప్రకటన, రాజ్యసభలో ఎంపీ విజయ సాయిరెడ్డి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం
విశాఖ పరిధిలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీ ఆధునికీకరణకు (Visakh Refinery Expansion) రూ.20,928 కోట్ల మేర వ్యయం అవుతుందని గతంలో కేంద్రం అంచనా వేసింది. అయితే తాజాగా ఈ వ్యయాన్ని రూ.26,264 కోట్లకు సవరిస్తున్నట్లు సోమవారం కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలిపారు.
పార్లమెంటు బడ్జెట్ మలి విడత సమావేశాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి.చాలా అంశాల్లో తెలుగు రాష్ట్రాలు కోరినట్టుగా కేంద్రం ప్రకటనలు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం నాటి రాజ్యసభ సమావేశాల్లో ఏపీకి చెందిన ఓ అంశానికి సంబంధించి నిధులను పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ పరిధిలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీ ఆధునికీకరణకు (Visakh Refinery Expansion) రూ.20,928 కోట్ల మేర వ్యయం అవుతుందని గతంలో కేంద్రం అంచనా వేసింది. అయితే తాజాగా ఈ వ్యయాన్ని రూ.26,264 కోట్లకు సవరిస్తున్నట్లు సోమవారం కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు జవాబిచ్చారు.
హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలోని విశాఖపట్నం రిఫైనరీ ఆధునికీకరణ వ్యయం రూ.20,928 కోట్ల నుంచి రూ.26,264 కోట్లకు సవరించాం- రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ జవాబుhttps://t.co/2pM60btl4z
— YSR Congress Party (@YSRCParty) March 28, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 28, 2022 06:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

