MLA N Venkate Gowda: సీఎం కప్‌ గెలిస్తే రూ. 10 లక్షలు బహుమానం, సీఎం కప్‌ పోటీల ప్రారంభోత్సవంలో ప్రకటించిన పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ

పలమనేరు నియోజకవర్గ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో సీఎం కప్‌ సాధిస్తే రూ.10 లక్షలు బహుమానంగా అందజేస్తానని స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ ప్రకటించారు. పలమనేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నియోజకవర్గస్థాయి సీఎం కప్‌ పోటీలను బుధవారం ఆయన క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు.

MLA N Venkate Gowda: సీఎం కప్‌ గెలిస్తే రూ. 10 లక్షలు బహుమానం, సీఎం కప్‌ పోటీల ప్రారంభోత్సవంలో ప్రకటించిన పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ
Palamaner MLA N Venkate Gowda (Photo-Facebook)

పలమనేరు నియోజకవర్గ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో సీఎం కప్‌ సాధిస్తే రూ.10 లక్షలు బహుమానంగా అందజేస్తానని స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ ప్రకటించారు. పలమనేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నియోజకవర్గస్థాయి సీఎం కప్‌ పోటీలను బుధవారం ఆయన క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాలీ బాల్‌ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు.ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ఈ నియోజకవర్గం నుంచి విజేతలకు తన రెండునెలల గౌరవవేతనాన్ని అందజేస్తానని ప్రకటించారు. మానసిక వికాసానికి క్రీడలు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు.

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 16, 2021 07:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).