MLA Koneti Adimulam Case Update: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక మలుపు, గుండె నోప్పిగా ఉందని‌ వైద్య పరీక్షలకు సమయం కోరిన బాధితురాలు

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన అత్యాచార కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేశారంటూ కేసు పెట్టారు వరలక్ష్మి… ఇక, కేసు విచారణలో భాగంగా వరలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహించాలని‌ పోలీసులు భావించారు..

MLA Koneti Adimulam Case Update: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక మలుపు, గుండె నోప్పిగా ఉందని‌ వైద్య పరీక్షలకు సమయం కోరిన బాధితురాలు
Shocking Facts About TDP MLA Koneti Adimulam, here is the full details

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన అత్యాచార కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేశారంటూ కేసు పెట్టారు వరలక్ష్మి… ఇక, కేసు విచారణలో భాగంగా వరలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహించాలని‌ పోలీసులు భావించారు.. అయితే, అనారోగ్యంతో పాటు.. గుండె నొప్పిగా ఉందని చెబుతున్న బాధితురాలు వరలక్ష్మి.. తనకు వైద్య పరీక్షలకు కొంత సమయం కావాలని ఈస్ట్ పోలీసులను కోరారు.అనారోగ్య సమస్యలు.. గుండె నొప్పితో బాధపడుతున్న నాకు.. వైద్య పరీక్షల కోసం కొంత సమయం ఇవ్వాలంటూ రాతపూర్వకంగా పోలీసులను కోరారు. దీంతో అమెకు వైద్య పరీక్షలను పూర్తిగా కోలుకున్నాక నిర్వహించడానికి పోలీసులు అంగీకరించారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, అనారోగ్యంతో చేరినట్లు సమాచారం

సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీ పురానికి చెందిన టీడీపీ మహిళా కార్యకర్తపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఎమ్మెల్యే ఆదిమూలాన్ని పార్టీ నుంచి టీడీపీ సస్పెండ్‌ చేసిన సంగతి విదితమే. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే ఆదిమూలంపై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 09, 2024 01:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).