Andhra Pradesh: ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్, వైసీపీ ఎంపీల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలు..మూడు టీడీపీ ఖాతాలోకే!
ఏపీలో రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వైసీపీ నుండి రాజ్యసభ ఎంపీలుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామాతో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీన ఉప సంహరణ ఉండనుంది. డిసెంబర్ 20న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్, అదేరోజు లెక్కింపు ఉండనుంది.
ఏపీలో రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వైసీపీ నుండి రాజ్యసభ ఎంపీలుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామాతో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం.
డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీన ఉప సంహరణ ఉండనుంది. డిసెంబర్ 20న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్, అదేరోజు లెక్కింపు ఉండనుంది.
ఎంపీలుగా రాజీనామా చేసిన వెంకటరమణ, బీద మస్తాన్‌రావు ..ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరగా కృష్ణయ్య తటస్థంగా ఉన్నారు. ఈ మూడు స్థానాలు టీడీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి. కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 26, 2024 03:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

