AP Deputy CM Pawan Kalyan Meets Union Minister Gajendra Singh Shekhawat(X)

Hyd, Nov 26:  ఏపీని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతాం అని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేంద్రం నుంచి సహాయ సహకారాల కోసం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పవన్ భేటి అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు కీలక పర్యాటక ప్రాజెక్టులు అమలు చేయబోతున్నామని పవన్ ప్రకటించారు.

ఏపీకి 975 కి.మీ సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉండటంతో పర్యాటక రంగాభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు పవన్. గండికోట లాంటి వారసత్వ ప్రాంతాలను అభివృద్ధితో పాటు రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయం పెట్టాలని కేంద్రాన్ని కోరినట్లు పవన్ తెలిపారు.  మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై పోక్సో కేసు , మైనర్ బాలిక అత్యాచార విషయంలో దుష్ప్రచారం చేశారని ఫిర్యాదు మేరకు పోక్సో కేసు

Here's Video:

ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు పర్యాటక ప్రాజెక్టులపై చర్చ జరిగిందని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.