విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తన వల్లే ఆగిపోయిందని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో తన సత్తా ఏంటో సీఎం జగన్, ప్రధాని మోదీకి తెలిసిందని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయర్ లేకుండా వాదించానని గుర్తుచేశారు. ఆర్డర్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేశానని కేఏ పాల్ స్పష్టం చేశారు.అయితే క్రెడిట్ మరొకరికి ఇస్తున్నారని మండిపడ్డారు. తనకు క్రెడిట్ దక్కకపోవడానికి కారణం మీ కులంలో పుట్టకపోవడమేనా..? అని అడిగారు.2 నెలలు కష్టపడి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకుండా ఆపితే తెలుగు మీడియా నాకు క్రెడిట్ ఇవ్వట్లేదు.. తెలుగు మీడియా కుటుంబాలు సర్వనాశనం అవుతాయని అన్నారు.  గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు, పోలీసులను ఆశ్రయించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)