TDP Activists Attacked DC Office: వీడియో ఇదిగో, డెక్కన్ క్రానికల్ ఆఫీసును తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన డీసీ

ఏపీలో కూటమి ప్రభుత్వం కార్యకర్తలు డెక్కన్‌ క్రానికల్‌ ఆఫీస్‌ మీద దాడికి దిగారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై కూటమి ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుందని డీసీ ఈ మధ్య ఒక వార్తను ప్రచురించింది. దీంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు కార్యాలయాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించారు.

TDP Activists Attacked DC Office: వీడియో ఇదిగో, డెక్కన్ క్రానికల్ ఆఫీసును తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన డీసీ
TDP Activists attacked Deccan Chronicle office after publish an unbiased report on VSP privatisation Watch Video

ఏపీలో కూటమి ప్రభుత్వం కార్యకర్తలు డెక్కన్‌ క్రానికల్‌ ఆఫీస్‌ మీద దాడికి దిగారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై కూటమి ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుందని డీసీ ఈ మధ్య ఒక వార్తను ప్రచురించింది. దీంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు కార్యాలయాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించారు. టీడీపీకి సంబంధించిన టీఎన్ఎస్ఎఫ్, తెలుగు మహిళ విభాగాలు.. డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడికి ప్రయత్నించాయి.  ఇంటి స్థలం విషయంలో అక్కపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడు...వీడియో వైరల్

ఈ క్రమంలో సిబ్బంది అడ్డుకోవడంతో.. వాళ్లలో టీడీపీ కేడర్‌ వాగ్వాదానికి దిగారు. ఆపై ఆగ్రహంతో టీఎన్‌ఎస్‌ఎఫ్‌కు చెందిన కొందరు సంస్థ కార్యాలయంపై రాళ్లు రువ్వి.. బయట ఆ సంస్థ బోర్డును కాల్చేశారు.ఈ ఘటనపై ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌లో డీసీ సంస్థ ఫిర్యాదు చేసింది. ఇలాంటి చర్యలు తమ కర్తవ్యాల్ని ఆపలేవంటూ డీసీ తన ఎక్స్‌ఖాతాలో సందేశం ఉంచింది. దీనికి సంబంధించిన వీడియోని డీసీ ఎక్స్ లో షేర్ చేసింది. ఈ దాడిని వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఖండించారు.

Here's DC Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 10, 2024 10:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).