కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌, సినీనటుడు పృథ్వీరాజ్‌ (Prudhvi Raj) జనసేనలో చేరారు. బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan).. వీరికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, పార్టీ విధానాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పవన్‌.. వారికి సూచించారు. ఇటీవల పవన్‌ కల్యాణ్‌ నటించిన బ్రో చిత్రంలో పృథ్వీరాజ్‌.. మంత్రి అంబటి రాంబాబు తరహాలో నృత్యం చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Here's Janasena Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)