Visakhapatnam: వీడియో ఇదిగో, ప్రభుత్వ హాస్టల్ గోడదూకి 31న రాత్రి మందు పార్టీ చేసుకున్న ఆరో తరగతి విద్యార్థులు
విశాఖపట్నం పరిధిలోని అనకాపల్లి జిల్లా చోడవరంలో ఆరు నుంచి పది చదువుతున్న 16 మంది విద్యార్థులు డిసెంబరు 31న రాత్రి ఫుల్లుగా మందుకొట్టి నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి
- Read in
- తెలుగు
విశాఖపట్నం పరిధిలోని అనకాపల్లి జిల్లా చోడవరంలో ఆరు నుంచి పది చదువుతున్న 16 మంది విద్యార్థులు డిసెంబరు 31న రాత్రి ఫుల్లుగా మందుకొట్టి నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. హాస్టల్ నుంచి గోడదూకి బయటకు వచ్చి విద్యార్థులు మరో ఇద్దరు యువకులతో కలిసి హాస్టల్ పక్కనే నిర్మిస్తున్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఎంచక్కా మందుపార్టీ చేసుకున్నారు.
బిర్యానీ తెచ్చుకుని మందు తాగుతూ రాత్రంతా అక్కడే గడిపేశారు. శనివారం రాత్రి మొదలైన పార్టీ ఆదివారం కూడా కొనసాగింది. తింటూ, తాగుతూ అల్లరికి దిగడంతో గమనించిన ఏసీ మెకానిక్, డ్రైవింగ్ స్కూల్ డ్రైవర్ ఒకరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. తమను ఫొటోలు తీస్తున్న వారిని విద్యార్థులు హెచ్చరించడంతోపాటు మెకానిక్‌పై దాడిచేసి గాయపరిచారు.
Here's Video
బాలుర వసతి గృహంలో మందు కొట్టిన 7వ తరగతి విద్యార్థులు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పేరిట అతి. అనకాపల్లి జిల్లా చోడవరం
బాలుర వసతి గృహంలో ఘటన. వీడియో తీసిన వ్యక్తిపై దాడి చేసిన స్టూడెంట్స్. పట్టించుకోని హాస్టల్ వార్డెన్.#AndhraPradesh#Visakhapatnam #Vizag pic.twitter.com/WXkrLRvY9v
— Vizag News Man (@VizagNewsman) January 3, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 03, 2024 12:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

