విశాఖపట్టణంలో గత రాత్రి ఓ వైద్యురాలు తాగిన మత్తులో కారు డ్రైవ్ చేస్తూ బీభత్సం సృష్టించింది. ప్రమాదం తర్వాత ఆమె మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. రామాపురం నుంచి సిరిపురం వైపు వెళ్తున్న కారు వీఐపీ రోడ్డులో ప్యారడైజ్ హోటల్ సమీపంలో అదుపుతప్పి పార్కింగ్ చేసి ఉన్న ఏడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. సోమా పబ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత డివైడర్ పైనున్న చెట్టును ఢీకొట్టి కారు ఆగిపోయింది. ఈ ఘటనలో కారు నుజ్జుగా మారింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

VisakhaPatnam Woman doctor created havoc while driving under the influence of alcohol

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)