వైఎస్ఆర్‌సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి నారా లోకేష్ కు ఛాలెంజ్ విసిరారు. టీడీపీ యువనేత తనపై చేసిన అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. లోకేష్ నువ్వు మగాడైతే, నువ్వు చంద్రబాబుకే పుట్టి ఉంటే నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలి. నేను వెయ్యి కోట్ల అవినీతి చేసి ఉంటే నిరూపించు. నన్ను ఏదో చేయాలి అనుకున్న మీ అయ్య వల్లే కాలేదు.. నీ వల్ల ఏమౌతుంది. లోకేష్‌ నీవు పప్పు కాదు.. వెర్రి పుష్పానివి.

లోకేష్.. నిన్ను త్వరలో ఎర్రగడ్డ పిచ్చి ఆస్పత్రిలో జాయిన్ చేస్తారు. పెద్దిరెడ్డి రాజకీయ అనుభవం అంత లేదు నీ జీవితం. నువ్వా పెద్దిరెడ్డిని విమర్శించేది.వార్డు నెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్‌ నువ్వు ఐపీఎస్‌ ఆఫీసర్లను విమర్శిస్తావా. వచ్చే ఎన్నికల్లో నిన్ను వార్డు మెంబర్‌గా కూడా గెలవనీయం. పల్నాడు జిల్లాలో ఏడుకు ఏడు నియోజకవర్గాలు గెలుస్తాం. క్రిమినల్స్‌ను పక్కన పెట్టుకుని వారిచ్చిన స్క్రిప్ట్ లోకేష్ చదువుతున్నాడని మండిపడ్డారు.

YSRCP Macherla MLA Pinnelli Ramakrishna Reddy Challenged Nara Lokesh on Corruption Allegations

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)