Telangana: వీడియో ఇదిగో, చైనా మాంజా మెడకు చుట్టుకుని ట్రాఫిక్ పోలీసుకు తీవ్ర గాయాలు, నారాయణగూడ ఫ్లై ఓవర్ నుంచి తిలక్ నగర్ వెళ్తుండగా ఘటన
చైనా మాంజా చాలా ప్రమాదకరంగా మారింది. ఈ మాంజా కారణంగా పలు చోట్ల మరణాలు సంభవించగా మరికొన్ని చోట్ల చాలామంది గాయాల పాలయ్యారు. తాజాగా నారాయణగూడ ఫ్లై ఓవర్ నుంచి తిలక్ నగర్ వెళ్తుండగా చైనా మాంజా మెడకు చుట్టుకుని ట్రాఫిక్ పోలీస్ గాయపడ్డారు.
చైనా మాంజా చాలా ప్రమాదకరంగా మారింది. ఈ మాంజా కారణంగా పలు చోట్ల మరణాలు సంభవించగా మరికొన్ని చోట్ల చాలామంది గాయాల పాలయ్యారు. తాజాగా నారాయణగూడ ఫ్లై ఓవర్ నుంచి తిలక్ నగర్ వెళ్తుండగా చైనా మాంజా మెడకు చుట్టుకుని ట్రాఫిక్ పోలీస్ గాయపడ్డారు. బాధితుడిని లంగర్ హౌస్ పీఎస్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శివరాజ్ గా గుర్తించారు. ఇక సంగారెడ్డి జిల్లా కర్దనూరు రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తికి చైనా మాంజా తగిలి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితుని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పటాన్చెరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
మరో ఘటనలో నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల కేంద్రంలో ఒక యువకుడికి చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. మండల కేంద్రానికి చెందిన అద్నాన్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చైనా మాంజా చుట్టుకోవడంతో మెడకు, కాలుకు, చేతివేలికి గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లడంతో డాక్టర్లు చికిత్స చేసి ఎలాంటి ప్రాణాపాయం లేదనడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
చైనా మాంజా మెడకు చుట్టుకుని ట్రాఫిక్ పోలీసుకు తీవ్ర గాయాలు
ప్రాణాల మీదకు తెస్తున్న చైనా మాంజా..
నారాయణగూడ ఫ్లై ఓవర్ నుంచి తిలక్ నగర్ వెళ్తుండగా చైనా మాంజా మెడకు చుట్టుకుని గాయపడ్డ ట్రాఫిక్ పోలీస్
లంగర్ హౌస్ పీఎస్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శివరాజ్ pic.twitter.com/sMxy24HVE1
— Swathi Reddy (@Swathireddytdp) January 15, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 15, 2025 02:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

