TSRTC Discount: పెళ్లిళ్ల సీజన్‌కు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక రాయితీ.. జూన్‌ 30 వరకు 10 శాతం డిస్కౌంట్ వర్తింపు

పండుగల సమయంలో ప్రయాణికులను ఆకర్షించడానికి టికెట్లపై ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్న టీఎస్‌ ఆర్టీసీ.. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌లో కూడా ప్రయాణికులకు ప్రత్యేక రాయితీ ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ 30 వరకు అన్ని రకాల అద్దె సర్వీసులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

TSRTC Discount: పెళ్లిళ్ల సీజన్‌కు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక రాయితీ.. జూన్‌ 30 వరకు 10 శాతం డిస్కౌంట్ వర్తింపు
Telangana RTC Strike | (Photo-PTI)

Hyderabad, Feb 10: పండుగల సమయంలో ప్రయాణికులను ఆకర్షించడానికి టికెట్లపై  ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్న టీఎస్‌ ఆర్టీసీ.. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌లో కూడా ప్రయాణికులకు ప్రత్యేక రాయితీ ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ 30 వరకు అన్ని రకాల అద్దె సర్వీసులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. గతంలో కార్తీక మాసం, వన భోజనాలు, శబరిమల అయ్యప్ప దర్శనం సందర్భంగా అద్దె బస్సులకు టీఎస్‌ ఆర్టీసీ రాయితీ కల్పించింది. గత ఏడాది డిసెంబర్‌ 31తో ఆ రాయితీ గడువు ముగిసింది. కాగా సీజన్ల వారీగా ఎప్పటికప్పుడు ప్రయాణికులను ఆకర్శించేందుకు టీఎస్‌ ఆర్టీసీ రాయితీలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 10, 2023 09:10 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).