మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద బైక్‌ను ఓ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ తీవ్రంగా గాయపడ్డారు. నర్సాపూర్ చౌరస్తా వద్ద దశరథ్ అనే వ్యక్తి బైక్ మీద మున్సిపల్ ఆఫీస్ వైపు వెళ్తుండగా టిప్పర్ వెనక నుంచి ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపైనుంచి లారీ వెళ్లిపోయింది. ఈ క్రమంలో బైక్ ట్యాంకర్ పేలడంతో మంటలు చెలరేగాయి. అప్పటికే గాయపడిన దశరథ్‌కు మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు మంటలు ఆర్పివేసి.. అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇదంతా సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Tipper hit a bike at Narsapur intersection in Tupran town
సీసీటీవీ ఫుటేజ్.. షాకింగ్ వీడియో
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద బైక్‌ను ఢీకొట్టి పైనుండి వెళ్లిన టిప్పర్
ప్రమాదంలో బైక్ పూర్తిగా దగ్ధం.. బైక్‌పై ఉన్న దశరథ్‌కు తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు pic.twitter.com/BmxkquuxpO
— Telugu Scribe (@TeluguScribe) December 3, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)