Covid in Telangana: తెలంగాణలో కొత్తగా 495 కరోనా కేసులు నమోదు, ఇద్దరు మృతితో 1,685 చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య, జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 142 మందికి కరోనా, ప్రస్తుతం 4,241 యాక్టివ్ కేసులు
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 495 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... ఒక్కరోజులో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 247 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,804 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,99,878 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,685గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 4,241 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,870 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 142 మందికి కరోనా సోకింది.
తెలంగాణలో 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలు
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.27.03.2021)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/PSRNqxCAV5
— IPRDepartment (@IPRTelangana) March 27, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 27, 2021 11:25 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

