Cyberabad Traffic Police: నువ్వు హెల్మెట్‌ పెట్టుకుంటే బాగుంటావ్‌ నాన్న.. బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో నాన్న, ట్రాఫిక్ రూల్స్ గురించి సరికొత్తగా ప్రచారం చేస్తున్న సైబరాబాద్ పోలీసులు

సైబరాబాద్ పోలీసులు కొత్తగా ముందుకు వెళుతున్నారు. సినిమా పోస్టర్లను వాడుకుంటూ ట్రాఫిక్ మీద ప్రతి ఒక్కరికీ పోలీసులు (Cyberabad Traffic Police) అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా నేచురల్‌ స్టార్‌ నాని జెర్సీ మూవీని (Awareness With Using Jersey Poster) వాడుకున్నారు. ఇందులో క్రికెటర్‌గా దర్శనమిచ్చిన నాని ఫీల్డ్‌లో బ్యాట్‌ పట్టుకుని ముఖాన హెల్మెట్‌ పట్టుకుని ఏ ఫోరో, సిక్సరో బాదడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుండగా మరో ఫొటోలో హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడుపుతున్నాడు. ఇది చూసిన అతడి కొడుకు గౌతమ్‌.. "నువ్వు హెల్మెట్‌ పెట్టుకుంటే బాగుంటావ్‌ నాన్న.. బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో నాన్న" అని సలహా ఇస్తున్నట్లుగా ఉంది. పనిలో పనిగా జాతీయ అవార్డు అందుకున్నందుకు జెర్సీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే చావు కబురు చల్లగా పోస్టర్‌ను కూడా ఫుల్‌గా వాడుకున్నారు. హెల్మెట్‌ పెట్టుకోండి బస్తీ బాలరాజు గారూ.. ఎలాంటి కబురు వినాల్సిన అవసరం లేదు.. అని మీమ్‌ షేర్‌ చేసిన విషయం తెలిసిందే!

Cyberabad Traffic Police: నువ్వు హెల్మెట్‌ పెట్టుకుంటే బాగుంటావ్‌ నాన్న.. బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో నాన్న, ట్రాఫిక్ రూల్స్ గురించి సరికొత్తగా ప్రచారం చేస్తున్న సైబరాబాద్ పోలీసులు
Cyberabad police have arrested 11 gang members for making fake vehicle insurance copies (Photo-Twitter/cyberabad police)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 24, 2021 12:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).