Delhi Liquor Policy Case: ఢిల్లీ మద్యం కేసు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ జులై 3 వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను జులై 3 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ఆమెకు విధించిన కస్టడీ ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపరిచారు.
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను జులై 3 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ఆమెకు విధించిన కస్టడీ ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కవిత పాత్రపై ఈడీ ఇటీవల సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. దాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. మరోవైపు సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ సాగనుంది. దీని కోసం ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచనున్నారు. కోర్టులోకి వస్తున్న సందర్భంలో ఎమ్మెల్సీ కవిత ‘జై తెలంగాణా, జై భారత్’ అంటూ నినాదాలు చేశారు. నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్..నేడు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పర్చనున్న తీహార్ జైలు అధికారులు
Here's Video
Kavitha enters the court hall saying Jai Telangana, Jai Bharat, the court extended judicial custody till July 3 after refusing bail#delhiliquorpolicycase #MLCKavitha pic.twitter.com/8nsLqVwK5z
— indtoday (@ind2day) June 3, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 03, 2024 12:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

