Dog Attack Boy Case: వీడియో ఇదిగో.. ఆ పిల్లాడిని కరవమని కుక్కలకు నేను చెప్పానా, మరోసారి హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి వివాదాస్పద వ్యాఖ్యలు

ఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి.. మరోసారి కుక్క కాట్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎవరినో కుక్క కరిస్తే.. కుక్కను నేనే కరవమన్నట్టు చేశారు’’ అంటూ మండిపడ్డారు.

Dog Attack Boy Case: వీడియో ఇదిగో.. ఆ పిల్లాడిని కరవమని కుక్కలకు నేను చెప్పానా, మరోసారి హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి వివాదాస్పద వ్యాఖ్యలు
Screengrab of CCTV footage of Hyderabad boy, Pradeep, being targeted by street dogs. (Photo Credits: Twitter/ANI)

ఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి.. మరోసారి కుక్క కాట్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎవరినో కుక్క కరిస్తే.. కుక్కను నేనే కరవమన్నట్టు చేశారు’’ అంటూ మండిపడ్డారు. కావాలనే తనపై బురద జల్లుతున్నారని నిప్పులు చెరిగారు.రాజకీయాల్లో మహిళల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడతారని, మహిళలు బయటకు వస్తే ఓర్వలేరు.. తట్టుకోలేరన్నారు.

తెలంగాణలో కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన ఘటనపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ సార్‌.. ఒక్క దగ్గరకు చేర్చిన కుక్కల మధ్యలోకి మేయర్‌ను పంపండి అంటూ కామెంట్స్‌ చేశారు. ఈ క్రమంలోనే మేయర్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయకూడదని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి మేయర్‌ వివాదస్పద వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 06, 2023 06:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).