హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 190 గ్రాముల హెరాయిన్ ను సీజ్ చేశారు పోలీసులు. ఈ వ్యవహారంలో ఇద్దరు అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్‌ని అరెస్ట్ చేయగా సుమారు రూ. 25 లక్షల విలువ చేసే డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. అలాగే సినీ, క్రీడా రంగ ప్రముఖులతో అవగాహన కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా చేసే వారికి చుక్కలు కనిపిస్తుండగా తాజాగా భారీ ఎత్తున  డ్రగ్స్ పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. నాంపల్లి నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌లో ప్రమాదం...జాయింట్‌వీల్‌లో సాంకేతికలోపం, తలకిందులుగా ఇరుక్కుపోయిన పర్యాటకులు, వీడియో ఇదిగో

Drug Rocket Bust in Hyderabad: Rachakonda Police Seize 190 Grams of Heroin

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)