హైదరాబాద్‌లో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. రాంగ్‌రూట్‌లో వెళ్లొద్దని సూచించిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ నాగరాజుపై మందులో ఉన్న రోహిత్ (25) దాడి చేశాడు. ఈ ఘటన అంబర్‌పేట్‌ అలీ కేఫ్‌ సమీపంలో జరిగింది. కానిస్టేబుల్ గొంతు పట్టుకొని దాడి చేస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులో భాగంగా పరీక్షించగా నిందితుడు మద్యం సేవించినట్టు తేలింది. సదరువ్యక్తిపై అంబర్‌పేట్‌ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కానిస్టేబుల్ నాగరాజు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ట్రాఫిక్ పోలీస్ చేయి కొరికి దాడి చేసిన హెల్మెట్ లేని రైడర్, వీడియో సోషల్ మీడియాలో వైరల్, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)