హైదరాబాద్ నిజాంపేట్(Nizampet) ఫిట్‌నెస్ స్టూడియో సమీపంలో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. స్టూడియో సమీపంలోని టిఫిన్స్ సెంటర్‌లో గ్యాస్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు.

ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది అగ్ని(Fire)మాపక సిబ్బంది. పక్కనే ఉన్న మరో మూడు షాపులకు మంటలు వ్యాపించగా పూర్తిగా దగ్ధం అయ్యాయి.

మరోవైపు మంత్రి సీతక్క నియోజకవర్గంలో గ్రామ సభలో అధికారుల ముందే రైతు పురుగుల మందు తాగిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. గూడెం మండలం బుట్టాయిగూడెంలో జరిగిన గ్రామసభలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో కొత్తూరు గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వర్ రావు అనే రైతు గ్రామ సభ వద్ద పురుగుల మందు తాగాడు. వీడియో ఇదిగో, ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో అధికారుల ముందే పురుగుల మందు తాగిన రైతు, పరిస్థితి విషమం

Fire accident at Hyderabad Nizampet fitness studio

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)