మంత్రి సీతక్క నియోజకవర్గంలో గ్రామ సభలో అధికారుల ముందే రైతు పురుగుల మందు తాగిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. గూడెం మండలం బుట్టాయిగూడెంలో జరిగిన గ్రామసభలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో కొత్తూరు గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వర్ రావు అనే రైతు గ్రామ సభ వద్ద పురుగుల మందు తాగాడు.
గొర్రెల దొడ్డిపై వీధి కుక్కల దాడి.. 25 గొర్రెలు మృతి, రూ. 3లక్షల ఆస్తి నష్టం
కాంగ్రెస్ వాళ్లకే ప్రభుత్వ పథకాలు వచ్చాయని అధికారులను నిలదీశాడు. అనంతరం పురుగుల ముందు (Farmer Drinks Pesticide ) తాగాడు. నాగేశ్వరరావును అధికారులు ఎటూరు నాగారానికి తరలించారు. ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ములుగు జిల్లా కేంద్రంలోని వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
Farmer Drinks Pesticide
Breaking News
మంత్రి సీతక్క నియోజకవర్గంలో గ్రామ సభలో అధికారుల ముందే పురుగుల మందు తాగిన రైతు.. పరిస్థితి విషమం
ప్రజా పాలనలో దరఖాస్తు పెట్టుకుంటే దేనికి అర్హుడిని కాలేదని మనస్థాపానికి గురై, అధికారుల ముందే పురుగుల మందు తాగిన రైతు కుమ్మరి నాగేశ్వరరావు
ములుగు జిల్లా కన్నాయిగూడెం… pic.twitter.com/LjnW3BsYeB
— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) January 23, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)