హైదరాబాద్ (Hyderabad)మాసబ్ ట్యాంక్ - శాంతిన‌గ‌ర్‌లో విషాదం నెలకొంది. మఫర్ కంఫర్టెక్‌ అపార్టుమెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు మృతి చెందాడు(Hyderabad Boy Trapped in Lift). నిన్న లిఫ్ట్ లో ఇరుక్కున్నాడు ఆరేళ్ల బాలుడు. నిలోఫర్ ఆసుపత్రిలో(Niloufer Hospital) చికిత్స పొందుతూ మృతి చెందాడు.

రెండున్నర గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత బాలుడిని బయటకు తీశారు అగ్నిమాపక సిబ్బంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆక్సిజన్ అందక బాలుడి అవయవాలు దెబ్బతిన్నాయి. దీంతో లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు అర్ణవ్‌ మృతి చెందాడు. పిల్లాడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

బిర్యానీ తిని డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి.. లాలాగూడలో ఘటన, హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు, వీడియో ఇదిగో

బిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. హైదరాబాద్(Hyderabad) - లాలాగూడ లోని సూపర్ స్టార్ హోటల్ లో బిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి చేశాడు. రాడ్డుతో హోటల్ సిబ్బందిపై దాడి చేసి, ఫర్నిచర్ ధ్వంసం చేశాడు దుండగుడు హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలించారు.

Hyderabad Boy Trapped in Lift,  Passes Away While Undergoing Treatment at Niloufer Hospital

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)