లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెపోటుతో పడిపోయిన కానిస్టేబుల్ ప్రాణాలను కాపాడారు లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మరో కానిస్టేబుల్ నరేష్. ఉదయం 7 గంటల సమయంలో విధులకు వెళ్తున్న సంతోష్ అనే కానిస్టేబుల్ ఫ్లోర్ మిల్ వద్ద గుండెపోటుతో కింద పడిపోవడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ నరేష్ CPR అందించి ప్రాణాలను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అతనికి అభినందనలు చెబుతున్నారు.
మరో ఘటనలో దేశ రాజధాని ఢిల్లీలో మహిళా కానిస్టేబుల్ ఒక ప్రయాణికురాలకిి CPR ఇవ్వడం ద్వారా ఆమె ప్రాణాలను కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ఒక మహిళా ప్రయాణికురాలు ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో అక్కడికక్కడే ఆమె స్పృహ కోల్పోయింది. అక్కడే డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ వెంటనే ఆమె దగ్గరకు చేరుకుని సీపీఆర్ చేసింది. కాసేపటికే ఆమె కోలుకుంది.
గుండెపోటుకు గురైన కానిస్టేబుల్ ప్రాణాలను సీపీఆర్ చేసి కాపాడిన మరో కానిస్టేబుల్
CPR చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్..
లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెపోటుతో పడిపోయిన కానిస్టేబుల్ ప్రాణాలను కాపాడిన లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ నరేష్. ఉదయం 7 గంటల సమయంలో విధులకు వెళ్తున్న సంతోష్ అనే కానిస్టేబుల్ ఫ్లోర్ మిల్ వద్ద గుండెపోటుతో కింద… pic.twitter.com/ckUgDE4g3n
— ChotaNews App (@ChotaNewsApp) February 20, 2025
గుండెపోటుతో కుప్పకూలిన కానిస్టేబుల్.. CPR చేసి ప్రాణాలు కాపాడిన సహచరుడు..
లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ సంతోష్ కు గుండెపోటు
వెంటనే CPR చేసి సంతోష్ ప్రాణాలను కాపాడిన సహచర కానిస్టేబుల్ నరేష్ pic.twitter.com/Ehd2hGLocR
— BIG TV Breaking News (@bigtvtelugu) February 20, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)