Hyderabad Horror: హైదరాబాద్ నగరంలో పట్టపగలే దారుణం, బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని వేట కొడవలి, రాడ్డుతో నరికి చంపిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు

అంబర్‌పేట్‌కు చెందిన జంగం సాయినాథ్‌ బైక్‌పై కోఠి ఇసామియా బజార్‌ నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి పురానాపూల్‌ జాతీయ రహదారిలో కార్వాన్‌ వైపు వెళ్తుండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి రాడ్డుతో దాడి చేశారు. కింద పడవేసి వేట కొడవలితో నరికి చంపారు.

Hyderabad Horror: హైదరాబాద్ నగరంలో పట్టపగలే దారుణం, బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని వేట కొడవలి, రాడ్డుతో నరికి చంపిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు
Man Kills Son To Hide Affairrepresentational purpose only | (Photo Credits: PTI)

హైదరాబాద్ నగరంలోని పురానాపూల్‌ జాతీయ రహదారిపై పట్టపగలే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఒకరిని వేట కొడవలి, రాడ్డుతో నరికి చంపారు.అంబర్‌పేట్‌కు చెందిన జంగం సాయినాథ్‌ బైక్‌పై కోఠి ఇసామియా బజార్‌ నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి పురానాపూల్‌ జాతీయ రహదారిలో కార్వాన్‌ వైపు వెళ్తుండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి రాడ్డుతో దాడి చేశారు. కింద పడవేసి వేట కొడవలితో నరికి చంపారు. పెట్రోలింగ్‌ విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ జనార్దన్‌ నిందితులను పట్టుకోవడానికి వెళ్లగా వారు మూసీనదిలో దూకి పారిపోయారు.

దాడిలో తీవ్రంగా గాయపడ్డ సాయినాథ్‌ అప్పటికే మృతి చెందాడు. ఈ దారుణాన్ని అక్కడే కొంతమంది ప్రయాణికులు చూస్తూ ఉండిపోయారే తప్ప ఎవరూ అడ్డుకోలేకపోయారు. ఈ ఘటనను సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.సాయినాథ్‌ హత్యకు గల కారణాలు తెలియరాలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Here's Disturbed Video

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 23, 2023 12:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).