మణికొండలో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసిన వీడియో వెలుగులోకి వచ్చింది. గంజాయి మత్తులో పోచమ్మ కాలనీ యువకుడిని ఈ గ్యాంగ్ చితకబాదింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ గ్యాంగ్ దాడి తర్వాత బైక్ వదిలి పరారైంది. పలు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. యువకుడి పై దాడి చేసిన గ్యాంగ్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

వీడియో ఇదిగో, సినిమాకి వెళ్లడానికి తండ్రి డబ్బులు ఇవ్వలేదని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలుడు, నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో గంజాయి బ్యాచ్‌ హడలెస్తున్నది. ఈ బ్యాచ్‌ పట్టణంలో రాత్రి అయితే చాలు ఎవరిపైనంటే వారిపై దాడులు చేస్తూ అడ్డూ అదుపు లేకుండా వ్యవహరిస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో గంజాయి బ్యాచ్‌ పాలమూరు పట్టణంలోని ఓ యువకుడిపై దాడి చేసిన ఘటన మరవకముందే మరో ఘటనలో రెండురోజుల కిందటే మహబూబ్‌నగర్‌ టు టౌన్‌ పోలీసులకు చిక్కారు. రెండు రోజుల కిందట న్యూటౌన్‌లోని గం జాయి బ్యాచ్‌ ఒకరిపై ఒకరు పదునైన ఆయుధాలతో దా డులకు పాల్పడుతుండగా స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మహబూబ్‌నగర్‌ డీఎస్పీ ఆదేశాల మేరకు విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Youth thrashed by ganja addicts in Manikonda

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)