టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపారు విప్రో సర్కిల్‌ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించిన ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయామ్‌ విత్‌ సీబీఎన్‌ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకు దిగిన ఐటీ ఉద్యోగులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించినడంతో విప్రోకూడలిలో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే చంద్రబాబునాయుడుపై అక్రమ కేసులు ఉపసంహరించుకోని.. ఆయనను విడుదల చేయాలని వారంతా డిమాండ్ చేశారు. ఈ నిరసనతో విప్రో జంక్షన్​లో ట్రాఫిక్ జాం ఏర్పడింది. సైబరాబాద్​ ట్రాఫిక్ పోలీసులు వాహనాలు నిలిచిపోకుండా చర్యలు చేపట్టారు.

I am with CBN (Photo-Video Grab)

Here's TDP Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)