హైదరాబాద్ మీర్‌పేట్‌లో భార్యను ఓ భర్త దారుణంగా హతమార్చిన( Meerpet Woman Murder Case) సంగతి తెలిసిందే. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు.. క్రైమ్ సీన్ నుండి ఆధారాలు సేకరించే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఈ ఘటనలో రోజుకో విషయం వెలుగులోకి వస్తుండగా తాజాగా మరో సంచలన న్యూస్ బయటకు వచ్చింది.
శవాన్ని ముక్కలు చేసి మాయం చేయడం ఎలా? అనే విషయాలను నిందితుడు గురుమూర్తి(gurumurthy) ఓ క్రైమ్ వెబ్‌సిరీస్(Crime Web Series) చూసి నేర్చుకున్నట్లు విచారణలో తేలింది. ముక్కలను కరిగించడానికి అవసరమైన కెమికల్స్ గురించి తెలుసుకునేందుకు యూట్యూబ్ వీడియో(youtube video)లను చూసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాక, పొరుగింట్లోకి దుర్వాసన వెళ్లకుండా కొన్ని ప్రత్యేక ద్రావణాలను ఉపయోగించినట్లు సమాచారం.
కాగా, ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇవాళ పోలీసులు(Hyderabad Police) ప్రకటించే అవకాశం ఉంది. ఈ కేసును చేధించేందుకు వివిధ రాష్ట్రాల ఫోరెన్సిక్ నిపుణులు, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నిందితుడు చేసిన హత్యకు సంబంధించిన క్లూస్‌ను సేకరించారు. హైదరాబాద్‌లో దారుణం, భార్యను చంపి డెడ్ బాడీని కుక్కర్ లో ఉడకించి ముక్కలను పొడి చేసిన భర్త, చివరకు ఎలా దొరికాడంటే..
Meerpet Woman Murder Case Update: Husband killed Wife Influenced by Web Series
భార్యను ముక్కలుగా నరికిన ఘటన... వెబ్ సిరీస్ ప్రభావంతో కిరాతక ఘటన
హైదరాబాద్ మీర్‌పేట్‌లో భార్యను ముక్కలుగా నరికిన ఘటనలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది.
శవాన్ని ముక్కలు చేసి మాయం చేయడం ఎలా? అనే విషయాలను నిందితుడు గురుమూర్తి ఓ క్రైమ్ వెబ్‌సిరీస్ చూసి నేర్చుకున్నట్లు… pic.twitter.com/T4lPBgyQ5d
— Telangana Awaaz (@telanganaawaaz) January 26, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)