KTR Tweet on CorbeVax Vaccine: తెలంగాణ నుంచి మరో కోవిడ్ టీకా, కార్బివాక్స్ కరోనా టీకాపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్, ఇప్పటికే భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకా విడుదల
తెలంగాణ రాష్ట్రం నుంచి మరో కోవిడ్ టీకా మార్కెట్లోకి రావడంపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ (Minister KTR Tweet) చేశారు. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను విడుదల చేయగా , తాజాగా తెలంగాణకు చెందిన బయోలాజికల్ ఈ కంపెనీ కార్బివాక్స్ అనే కోవిడ్ టీకాను మార్కెట్లోకి త్వరలో విడుదల చేయనుంది.
తెలంగాణ రాష్ట్రం నుంచి మరో కోవిడ్ టీకా మార్కెట్లోకి రావడంపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ (Minister KTR Tweet) చేశారు. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను విడుదల చేయగా , తాజాగా తెలంగాణకు చెందిన బయోలాజికల్ ఈ కంపెనీ కార్బివాక్స్ అనే కోవిడ్ టీకాను మార్కెట్లోకి త్వరలో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా బయలాజికల్ ఈ కంపెనీ సీఈఓ మహిమ దాట్ల ఆమె బృందానికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ కంపెనీ 2022 ఫిబ్రవరి నుంచి నెలకు 100 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదిలా ఉంటే బయలాజికల్ ఈ కంపెనీ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా కార్బివ్యాక్స్ కు అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. అలాగే సీరం అభివృద్ధి చేసిన కొవొవ్యాక్స్ టీకాకు, అమెరికా ఫార్మా సంస్థ మెర్క్ తయారు చేసిన మోల్నుపిరవర్ యాంటీ వైరల్ గోలికి కూడా అనుమతి ఇచ్చింది.
After Bharat Biotech’s CoVaxin now another Covid vaccine from #Telangana based company Biological E with CorbeVax 👍
My compliments to Mahima Datla Garu & her team 👏
Biological E aims to produce 100 million doses/month of Corbevax from February 2022 https://t.co/YwEkJQWxbY
— KTR (@KTRTRS) December 29, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 29, 2021 11:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

