Hyderabad Rains: హైదరాబాద్‌ జిల్లా పరిధిలో సోమవారం స్కూళ్లకు సెలవు...భారీ వర్షాలతో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో సోమవారం స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా ఈ సెలవు ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కాగా వచ్చే ఐదు గంటల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేశారు. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌లో అతి భారీ వానలు ఆదివారం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Hyderabad Rains: హైదరాబాద్‌ జిల్లా పరిధిలో సోమవారం స్కూళ్లకు సెలవు...భారీ వర్షాలతో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Students of Krishnapally ZP Secondary School holding umbrellas and listening to lessons due to rainwater leaking in the building Watch Video

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో సోమవారం స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.  భారీ వర్షాల కారణంగా ఈ సెలవు ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కాగా వచ్చే ఐదు గంటల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేశారు. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌లో అతి భారీ వానలు ఆదివారం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే ఖమ్మంలో 180 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యింది. అల్పపీడనం వాయుగుండంగా మారడంతో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని. హైదరాబాద్‌కు ఐఎండీ భారీ వర్షసూచన చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు అని అధికారులు హెచ్చరిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలోని 10 జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్ జారీ చేశారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 31, 2024 09:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).