Nagoba Jatara Begins: ప్రారంభమైన నాగోబా జాతర..గంగాజలంతో నాగేంద్రునికి మేస్రం వంశీయుల అభిషేకం, జాతరలో హైలైట్‌గా నిలవనున్న ప్రజాదర్బార్
మేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత అడవిబిడ్డలు నిర్వహించుకొనే జాతర నాగోబా(Nagoba Jatara Begins). పుష్య మాస అమావాస్య రోజున నాగోబా జాతర మొదలవుతుంది.
మేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత అడవిబిడ్డలు నిర్వహించుకొనే జాతర నాగోబా(Nagoba Jatara Begins). పుష్య మాస అమావాస్య రోజున నాగోబా జాతర మొదలవుతుంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో నాగోబా దేవాలయం ఉండగా జాతర కోసం మహారాష్ట్ర , చత్తీస్‌ఘడ్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున్న ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్(Keslapur)కు చేరుకున్నారు.
గోదావరి నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలంతో నాగేంద్రునికి మేస్రం వంశీయుల అభిషేకం, ప్రత్యేక పూజలు చేయగా మహా పూజ అనంతరం నాగోబా జాతర ఉత్సవాలు మొదలు అయ్యాయి. అత్యంత ప్రాచీన నాగరికత కలిగిన ఈ జాతరలో భాగంగా ఆదివాసీలు(Tribals)అడవిని పూజించడం ఆనావాయితీగా వస్తోంది.
ఇందులో ప్రతి మొక్కను, చెట్టును, పుట్టను మొక్కి తమ తమ కొర్కెలను తీర్చుకుంటారు. ఈ పూజా విధానం చాలా వరకు మెస్రం వంశీయుల నుండి ఆచారంగా, వంశపారపర్యంగా కొనసాగిస్తున్నారు. ఇక ఈ జాతరలో కీలకమైన ప్రజాదర్బార్ లో మంత్రులు, కలెక్టర్, వివిధశాఖల అధికారులు హాజరై గిరిజనుల సమస్యలకు పరిష్కారం చూపడం ఇక్కడి ప్రత్యేకత. హుస్సేన్‌సాగర్‌లో అగ్ని ప్రమాదం, గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం, బోటు ప్రమాదంలో ఇద్దరు మృతి
Nagoba Jatara Begins In Telangana Keslapur
ప్రారంభమైన నాగోబా జాతర
ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో కొలువైన నాగోబా దేవాలయం
నేడు రాత్రి నిర్వహించే మహా పూజతో జాతర ఉత్సవాలు ప్రారంభం
గోదావరి నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలంతో నాగేంద్రునికి మేస్రం వంశీయుల అభిషేకం, ప్రత్యేక పూజలు
మహా పూజ అనంతరం నాగోబా జాతర ఉత్సవాలు మొదలు pic.twitter.com/SFRq83ExhU
— BIG TV Breaking News (@bigtvtelugu) January 29, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

