Rain in Hyderabad Videos: హైదరాబాద్‌లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయం, భారీగా ట్రాఫిక్ జాం, వీడియోలో ఇవిగో
హైదరాబాద్‌లో ఈ రోజు మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమై భారీ వాన కురుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. నగరంలోని జూబ్లీహిల్, బంజారాహిల్స్, ఫిల్మీంనగర్‌లో భారీ వర్షం పడుతోంది. వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది
హైదరాబాద్‌లో ఈ రోజు మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమై భారీ వాన కురుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. నగరంలోని జూబ్లీహిల్, బంజారాహిల్స్, ఫిల్మీంనగర్‌లో భారీ వర్షం పడుతోంది. వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ
బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, షేక్‌పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, అమీర్‌పేట, రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్‌పురా, ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, లంగర్‌హౌస్, గండిపేట్, శివరాంపల్లి ప్రాంతాల్లో జోరుగా వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
Here's Videos
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. #hyderabad #hyderabadRains #chotanews pic.twitter.com/bW40k5ESrk
— ChotaNews (@ChotaNewsTelugu) June 17, 2024
హైదరాబాద్ లో వర్షం జోరుగా కురుస్తోంది.. డ్రైనేజీలు కాలువలు పొంగిపొర్లుతున్నాయి.. ఈదురుగాలులు కూడా భారీగా వీస్తున్నాయి.. #hyderabad #hyderabadRains #chotanews pic.twitter.com/UGUxi0AWUk
— ChotaNews (@ChotaNewsTelugu) June 17, 2024
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. #hyderabad #hyderabadRains #chotanews pic.twitter.com/bW40k5ESrk
— ChotaNews (@ChotaNewsTelugu) June 17, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 17, 2024 04:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

