Rains (photo-File Image)

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కి.మీ. ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే అయిదు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలతో పాటు అటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులు పడే ప్రమాదముందని హెచ్చరించింది.

ఇప్పటికే ఏపీలో పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా.. మరో మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. విపత్తు నిర్వహణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, నంద్యాల, వైఎస్ఆర్, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  వీడియో ఇదిగో, పోలవరం ప్రాజెక్ట్‌ని సందర్శించిన చంద్రబాబు, మధ్యాహ్నం 2 గంటల తర్వాత అధికారులతో సమీక్ష

అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పారు అధికారులు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున.. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ పనికి వెళ్లిన వారు, కూలీలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలన్నారు. ముఖ్యంగా తాటిచెట్ల కింద ఉండకూడదని సూచించారు.

ఇక తెలంగాణలో ( Telangana ) మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కిందకు వెళ్లవద్దని సూచించింది. నిన్న రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం కురిసింది.