చంద్రబాబు నాయుడు(Chandrababu) సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్ నుంచి స్పిల్‌వే సహా వివిధ ప్రాంతాలను ఆయన వీక్షించారు.
ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథితో పాటు ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలించారు. స్పిల్‌వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించనున్నారు.
Here's Video
#WATCH | Andhra Pradesh CM Chandrababu Naidu visits the Polavaram project site in Eluru.
The Polavaram Project is an under-construction multi-purpose irrigation project on the Godavari River in the Eluru District and East Godavari District in Andhra Pradesh. The project has been… pic.twitter.com/KhShKh0zcH
— ANI (@ANI) June 17, 2024
పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన ఇరిగేషన్ శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులు, టిడిపి, జనసేన, బీజేపీ నేతలు.#CBNinPolavaram #NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/IEd7UftcCH
— Telugu Desam Party (@JaiTDP) June 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)