CM Revanth Reddy: ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి రెండు సంతకాలు ఇవిగో, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం, దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక పత్రంపై రెండో సంతకం
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి సచివాలయానికి బయలుదేరారు. ఎల్బీ స్టేడియంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన ఆరు గ్యారెంటీలపై సంతకం చేశారు. రెండో సంతకం దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక పత్రంపై చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి సచివాలయానికి బయలుదేరారు. ఎల్బీ స్టేడియంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన ఆరు గ్యారెంటీలపై సంతకం చేశారు. రెండో సంతకం దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక పత్రంపై చేశారు. అనంతరం సచివాలయానికి బయలుదేరారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇవే:
మహాలక్ష్మి పథకం - పేద మహిళలకు నెలకు రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్.
గృహజ్యోతి - ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
రైతు భరోసా - రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ 500 బోనస్.
యువ వికాసం - ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు.
చేయూత - రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రూ. 10 లక్షలు. నెలవారీ పింఛను రూ. 4,000.
ఇందిరమ్మ ఇళ్లు - ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు.
Here's Taking Oath Video
Goosebumps 🥵🥵🔥🔥🔥🔥
Zptc - MLC - MLA - MP - TPCC and now CM of TS what journey 🫡
REVANTH REDDY ANE NENU🦁#RevanthReddy #TelanganaCMpic.twitter.com/R1cFePTyLM
— Nikhil_Prince💫 (@Nikhil_Prince01) December 7, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 07, 2023 03:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

