ఖమ్మం రూరల్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Car Accident Caught on Camera) ఓ యువకుడు మృతి చెందాడు. ముదిగొండ మండలానికి చెందిన పందిరి గౌతమ్(21) తన మిత్రుడు విక్టరీ వినయ్‌తో కలిసి వారి ఫ్రెండ్ ఇన్నోవా కారును తీసుకుని వరంగల్​ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆరెంపుల ఊరు శివారుకు రాగానే ఓ వాహనం ఎదురు రావడంతో దాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గౌతమ్ అక్కడికక్కడే మృతి (young man died) చెందాడు. గాయపడిన వినయ్​ ను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.  కదులుతున్న కారులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, అప్రమత్తమై దూకేసిన డ్రైవర్, వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)