ఎమ్మెల్యే కోటా( MLA Quota ) లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థులు( BRS Candidates ) ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. అధికార పార్టీ త‌ర‌పున నామినేష‌న్లు దాఖ‌లు చేసిన దేశ‌ప‌తి శ్రీనివాస్( Despathi Srinivas ), న‌వీన్ కుమార్( Naveen Kumar ), చ‌ల్లా వెంక‌ట్రామిరెడ్డి( Challa Venkatrami reddy ) ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ నుంచి ఈ ముగ్గురు ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను అందుకున్నారు.ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు నేటితో ముగిసింది. అయితే ఇత‌ర పార్టీల నుంచి ఎవ‌రూ నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌లేదు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)