Telangana: షాకింగ్...వసతి గృహంలో బాలికతో నగ్నపూజలకు యత్నం, భయంతో బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకున్న విద్యార్థిని, బాధ్యులపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

తెలంగాణలోని మంథని పట్టణ బాలికల వసతి గృహంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి బాలికతో నగ్నపూజలకు యత్నించిన ఘటన కలకలం రేపింది. వసతి గృహంలో పనిచేసే వంట మనిషి.. నగ్న పూజలు చేస్తే కనకవర్షం కురుస్తుందని యువతికి మాయ మాటలు చెప్పింది.

Telangana: షాకింగ్...వసతి గృహంలో బాలికతో నగ్నపూజలకు యత్నం, భయంతో బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకున్న విద్యార్థిని, బాధ్యులపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
Telangana cook Attempted nude worship with a girl at girls hostel(Video Grab)

తెలంగాణలోని మంథని పట్టణ బాలికల వసతి గృహంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి బాలికతో నగ్నపూజలకు యత్నించిన ఘటన కలకలం రేపింది. వసతి గృహంలో పనిచేసే వంట మనిషి.. నగ్న పూజలు చేస్తే కనకవర్షం కురుస్తుందని యువతికి మాయ మాటలు చెప్పింది.

వారం క్రితం వంట మనిషి పర్సనల్ రూంకు ఓ వ్యక్తిని తీసు కువచ్చి బాలికను పిలిపించి అతని ముందర నగ్నంగా ఉంటే ప్రత్యేక పూజలు చేస్తారని చెప్పింది. దీంతో ఆ విద్యార్థిని భయంతో హాస్టల్ నుంచి మంథని పట్టణంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లి నాలుగు రోజులుగా తలదాచుకుంది. విషయం తెలియడంతో తల్రిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు హాస్టల్ వద్దకు వచ్చి సదరు వంట మనిషిని నిలదీశారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాధ్యులపై పోక్సో కేసు నమోదు చేశారు.  వీడియో ఇదిగో, ఆర్టీసీ క్రాస్ రోడ్ బావర్చి బిర్యానీలో సగం తాగిన సిగరెట్ పీక, తిన్న తర్వాత చివర్లో చూసి షాకైన కస్టమర్ 

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 26, 2024 12:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).