Telangana: వీడియో ఇదిగో, ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్రజాభవన్ ముందు ఆందోళనకు దిగిన డీఎస్సీ 2008 బాధితులు, 5 నెలలుగా అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నామని ఆవేదన

డీఎస్సీ 2008 బాధితులు ప్రజా భవన్‌కు భారీగా తరలివచ్చారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్(Appointment Orders) ఇవ్వాలంటూ ప్రజా భవన్(Praja Bhavan) ముందు ఆందోళన(Dharna)కు దిగారు. తమకు ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని ఏడాది గడిచిపోయిన తమకు ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Telangana: వీడియో ఇదిగో, ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్రజాభవన్ ముందు ఆందోళనకు దిగిన డీఎస్సీ 2008 బాధితులు, 5 నెలలుగా అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నామని ఆవేదన
DSC 2008 victims protest in front of Praja Bhavan (Photo-Telgu Scribe/X)

డీఎస్సీ 2008 బాధితులు ప్రజా భవన్‌కు భారీగా తరలివచ్చారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్(Appointment Orders) ఇవ్వాలంటూ ప్రజా భవన్(Praja Bhavan) ముందు ఆందోళన(Dharna)కు దిగారు. తమకు ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని ఏడాది గడిచిపోయిన తమకు ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిందని, దాదాపు 5 నెలలుగా అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నామన్న అభ్యర్థులు తెలిపారు.

వీడియో ఇదిగో, విచక్షణారహితంగా మహిళపై దాడి చేసిన స్థానిక రాజకీయ నేతలు, అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలో ఘటన

తమకు నియామక పత్రాలు అందించేలా షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1399 మంది అభ్యర్థులు ఉన్నట్లుగా ప్రభుత్వం నిర్ధారించిందని తమకు ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేసి ఇన్నాళ్ల తమ నిరీక్షణ, వేదనకు తెరదించి తమ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సీఎం రేవంత్‌ రెడ్డి జోక్యం చేసుకొని తమ సమస్యకు పరిష్కారం చూపించాలని నినాదాలు చేశారు. కౌన్సిలింట్‌ షెడ్యూల్‌ ప్రకటించి పోస్టింగ్ లు ఇవ్వాలని కోరారు.

ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్రజాభవన్ ముందు ఆందోళనకు దిగిన డీఎస్సీ 2008 బాధితులు

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 28, 2025 01:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).