రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌, సులేమాన్ నగర్ ఎంఎం పహాడీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కట్టెల గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.మంటలకు తోడు భారీగా పొగ వ్యాపించడంతో స్థానికులు శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అత్తాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.  కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం, ఫర్నీచర్ షాపులో ఎగిసిపడ్డ అగ్నికీలలు, మరో మూడు షాపులకు పాకిన మంటలు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)