Aligireddy Joins Congress: టీఆర్ఎస్ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక నేతగా ఉన్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక నేతగా ఉన్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీకి వెళ్లిన అలిగిరెడ్డి... రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ పాల్గొన్నారు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన అలిగిరెడ్డి... 2014లో వొడితెల సతీష్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడిన ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. హుస్నాబాద్‌లో గత రెండు పర్యాయాలు టీఆర్‌ఎస్ టికెట్ సతీష్ కుమార్‌కే దక్కిన నేపథ్యంలో గత కొంత కాలంగా అలిగిరెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ టికెట్ దక్కదేమోనని భావించి తిరిగి సొంత గూటికి వెళ్లినట్లు సమాచారం.
I welcome Aligireddy Praveen Reddy garu, former MLA of Husnabad, Karimnagar District, into the Congress family.
He joined today in the presence of Leader of Opposition @kharge ji in Delhi.#TimeForCongress pic.twitter.com/nbVr0dbvM6
— Revanth Reddy (@revanth_anumula) July 19, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 20, 2022 12:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

