Promotions in TS Police: తెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రమోషన్లు.. 18 మందికి ఎస్పీలుగా, 37 మందికి ఏఎస్పీలుగా పదోన్నతి

తెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రమోషన్లు జరిగాయి.18 మంది అడిషనల్ ఎస్పీలను ఎస్పీలుగా, 37 మంది డీఎస్పీలను ఏఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Promotions in TS Police: తెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రమోషన్లు.. 18 మందికి ఎస్పీలుగా, 37 మందికి ఏఎస్పీలుగా పదోన్నతి
Telangana State Police. Credits: Facebook

Hyderabad, June 10: తెలంగాణ (Telangana) పోలీసు శాఖలో (Police Department) భారీ ప్రమోషన్లు (Promotions) జరిగాయి.18 మంది అడిషనల్ ఎస్పీలను ఎస్పీలుగా (SP), 37 మంది డీఎస్పీలను (DSP)  అడిషనల్ ఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులకు సంబంధించిన జీవో నిన్న రాత్రి విడుదలయింది. పదోన్నతి పొందిన అధికారులంతా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు పోలీసు అధికారులకు ప్రమోషన్ కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ అంజనీ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. పదోన్నతి పొందిన అధికారులకు అభినందనలు తెలిపారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 10, 2023 10:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).