Coronavirus in TS: తెలంగాణలో కొత్తగా 122 మందికి కోవిడ్, జీహెచ్ఎంసీ పరిధిలో 55 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 26,676 కరోనా పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 55 కరోనా కేసులు నమోదు కాగా, జిల్లాల్లో ఎక్కడా రెండంకెల్లో కొత్త కేసులు నమోదు కాలేదు.

Coronavirus in TS: తెలంగాణలో కొత్తగా 122 మందికి కోవిడ్, జీహెచ్ఎంసీ పరిధిలో 55 కరోనా కేసులు నమోదు
Coronavirus-in-India ( photo-PTI)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 26,676 కరోనా పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 55 కరోనా కేసులు నమోదు కాగా, జిల్లాల్లో ఎక్కడా రెండంకెల్లో కొత్త కేసులు నమోదు కాలేదు. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మెదక్, ములుగు, నారాయణపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్కకొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 176 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,68,955 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,61,093 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,924 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,938కి పెరిగింది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 18, 2021 10:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).