Corona in TS: తెలంగాణలో కొత్తగా 241 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు, ఇంకా 5,223 మందికి కొనసాగుతున్న చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 52,943 కరోనా పరీక్షలు నిర్వహించగా, 241 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 23, నల్గొండ జిల్లాలో 16 కేసులు గుర్తించారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 241 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు, ఇంకా 5,223 మందికి కొనసాగుతున్న చికిత్స
A resident gets tested for coronavirus in the Liwan District in Guangzhou in southern China (Photo: PTI)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 52,943 కరోనా పరీక్షలు నిర్వహించగా, 241 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 23, నల్గొండ జిల్లాలో 16 కేసులు గుర్తించారు. నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 298 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.రాష్ట్రంలో ఇప్పటివరకు 6,63,026 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,53,901 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,223 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,902కి పెరిగింది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 18, 2021 10:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).